భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.
Comments