రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం
తెలంగాణ : హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
Comments