• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌: ఐపీఎల్‌లో ధోనీ బరిలోకి దిగడంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. గజ్జల్లో గాయం కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడిన గత ఐదు మ్యాచ్‌లకు మహీ దూరంగా ఉన్నాడు. గువాహటి, బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లకు వెళ్లలేదు. అయితే, శనివారం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ నేపథ్యంలో ధోనీ జట్టుతో కలసి ఇక్కడకు రావడంతో అతడు బరిలోకి దిగుతాడనే అంచనాలు పెరిగాయి. కోచ్‌ ఫ్లెమింగ్‌ కూడా అతడు పూర్తి ఫిట్‌నె్‌సతో ఉన్నాడని చెప్పాడు. కానీ, ధోనీ ఆడే అవకాశాలు లేవని కొన్ని వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. నెట్స్‌లో మహీ తక్కువగా గడిపాడని, బరిలోకి దిగే విషయమై మేనేజ్‌మెంట్‌తో ఇంకా చర్చించలేదని తెలిపాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement