• Apr 19, 2026
  • NPN Log

    స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శనివారం) జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓటమి అంచుల నుంచి పోరాడి గెలుపు జెండా ఎగరేసింది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ ఎస్ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్  ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాక ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా నిలిచాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

    శనివారం(ఏప్రిల్ 18) ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ టాస్ ఓడాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి 6 మ్యాచ్‌ల్లో వరుసగా 6సార్లు టాస్ ఓడిపోయిన తొలి ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. అతను 2016లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టు బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదు సార్లు టాస్ ఓడిపోయాడు. అలానే ఏ కెప్టెన్ కూడా వరుసగా ఆరు కంటే ఎక్కువ టాస్‌లు ఓడిపోలేదు. 2015లో వార్నర్ వరుసగా ఐదు టాస్‌లు ఓడిపోయాడు. వార్నర్ చాలా టాస్‌లు ఓడిపోయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌, బ్యాట్స్‌మెన్‌ల్లో ఒకరిగా నిలిచాడు.

    ఇక ఇషాన్ కిషన్ విషయానికి వస్తే.. ఎస్ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన కావడంతో నాయకత్వ బాధ్యతలను యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించింది. ఈ జార్ఖండ్ స్టార్ అనుభవలేమి ఉన్నప్పటికీ బలమైన ఎస్ఆర్‌హెచ్ జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొత్త కెప్టెన్ నేతృత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. చెన్నైతో మ్యాచ్‌కు ముందు వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలు, 3 అపజయాలతో నిలిచింది. మొత్తంగా టాస్ పదే పదే ఓడిపోతున్నా కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యూహాలు బాగానే ఉన్నాయని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement