సరికొత్త సైబర్ క్రైమ్.. జాగ్రత్త సుమా!
సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేందుకు కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తున్నారు. తాజాగా పోలీసుల ఎంక్వైరీ అంటూ ఫోన్ చేస్తున్నారు. కొత్త నంబర్ నుంచి కాల్ చేసి ‘మీ డ్రైవర్, పనిమనిషి లేదా గృహ సహాయకురాలి గురించి పోలీసు ధ్రువీకరణ చేశారా?’ అని అడుగుతున్నారు. వెంటనే ధ్రువీకరణ చేయాలంటూ నంబర్ నొక్కాలని చెబుతున్నారు. ఇలా చేస్తే డేటా వాళ్ల చేతిలోకి వెళ్తుంది. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments