హరీష్ రావు ఇంట్లో విషాదం..
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి. ఈ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచినట్లు సమాచారం.










Comments