కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.









Comments