కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో CCI ద్వారా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపట్నుంచి ఆరంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వీటి ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలన్నారు. 2025-26లో 4.56లక్షల హెక్టర్లలో పత్తిసాగు చేశారని, 8లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. క్వింటాలు పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ₹8110ను రైతులకు అందించాలన్నారు. రైతులు కూడా పత్తి అమ్మకాలకు నిబంధనలు పాటించాలని సూచించారు.









Comments