₹1.56 లక్షలకు తగ్గనున్న బుల్లెట్ బైక్ ధర!
GST సవరణ నేపథ్యంలో తమ కంపెనీ బైక్స్ ధరలను తగ్గించినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దీంతో ఈనెల 22 నుంచి 350cc కెపాసిటీ మోడల్స్ ధరలు ₹22 వేల వరకు తగ్గనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350(బేస్ మోడల్) ఎక్స్ షోరూమ్ రేట్ ₹1.56 లక్షలు, క్లాసిక్ 350 రేట్ ₹1.77 లక్షలు, హంటర్ 350 ధర కనిష్ఠంగా ₹1.27 లక్షలకు తగ్గే అవకాశం ఉంది. అటు 350cc కెపాసిటీకి మించిన అన్ని రకాల మోడల్స్ రేట్స్ భారీగా పెరగనున్నాయి.
Comments