సైమా టెక్నాలజీస్‌కు 26 ఎకరాలు
అమరావతి : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సైమా ఎస్జీఎస్ టెక్నాలజీస్‌కు తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద 26.70 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ స్థాపించే పీసీబీ, సీసీఎల్, ఈఎంఎస్ ప్లాంట్లకు పాలనామోదం తెలిపింది. అలాగే, ఎలకా్ట్రనిక్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 586 కోట్లతో 613 మందికి ఉపాధిని కల్పించే హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో స్థాపించేందుకు పాలనామోదం తెలిపింది. సైమా, హిందాల్లో పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ పాలసీ 4.0 మేరకు ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments