80’s రీయూనియన్.. చెన్నైకి చిరు, వెంకీ
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి చెన్నై వెళ్లారు. అక్కడ జరిగే 80’s రీయూనియన్లో వారు పాల్గొననున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 80వ దశకంలో కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు ఒకే చోట కలవనున్నారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడుపుతారు. గతంలోనూ ఇలా చాలా సార్లు కలిశారు. కాగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ మామ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు.
Comments