967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
హైదరాబాద్ : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సంబంధిత వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 967 డిగ్రీ కళాశాలల్లో 2,41,936 సీట్లు ఉన్నాయన్నారు. శుక్రవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, యునివర్సిటీ కళాశాలలు, గురుకులాల్లో కోర్సుల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఆయా కళాశాలల నోటీసు బోర్డులపై ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇంటర్ అర్హత కలిగిన విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపాళ్లను కలిసి ధ్రువీకరణ పత్రాలు చూపించి ప్రవేశాలు పొందవచ్చన్నారు. ప్రవేశాల్లో స్థానిక విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, వారు లేని పక్షంలోనే స్థానికేతరులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
Comments