అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారా?
వన్డే కెప్టెన్‌గా గిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు రోహిత్‌తో BCCI చర్చలు జరిపింది. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ‘2027 వరకు ఆడతారా?’ అని రోహిత్, కోహ్లీని అడగగా వారు స్పష్టమైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అందుకే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆయనతో పాటు కోహ్లీకి సాధారణ జట్టు సభ్యులుగా చోటు కల్పించింది.
Comments