అనంతలో హోరెత్తిన ‘అన్నదాత పోరు’ అనంతపురం, సెప్టెంబర్ 09:
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మహా ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపుతో జరిగిన ఈ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చి నగరాన్ని సంచలనం చేశారు.
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ టవర్ క్లాక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింది. రైతాంగ సమస్యలపై గళమెత్తిన నినాదాలతో నగరం మార్మోగిపోయింది. ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి హాజరై రైతులకు సంఘీభావం ప్రకటించారు.
ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో రైతులు, వైసీపీ నాయకులు కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, “రైతుల కష్టాలు తీరకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోలేం. యూరియా కొరత తక్షణమే పరిష్కరించాలని, పంటలకు తగిన మద్దతు ధర కల్పించాలి” అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, శింగనమల సమన్వయకర్త శైలజానాథ్, తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి, రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తరువాత నేతలు ఆర్డీఓ కేశవనాయుడిని కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
Comments