అమెరికా సరిహద్దుల్లోకి వెళ్లినా.. దాటినా
వాషింగ్టన్ : అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాయేతర పౌరులు ఆమెరికాను వీడినా, దేశంలోకి వచ్చినా.. వారు సరిహద్దులు దాటే సమయంలో ముఖ గుర్తింపు వ్యవస్థ(ఫేస్ రికగ్నిషన్) సాయంతో ఫొటోలు తీయడానికి, బయోమెట్రిక్ వివరాలను సేకరించడానికి సరిహద్దుల్లోని సంబంధిత అధికారులకు వెసులుబాటు కల్పించింది. 14ఏళ్ల లోపు పిల్లలు, 79ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులను కూడా ఈ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చింది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్నవారిని, దొంగ పాస్‌పోర్టులతో అమెరికాలోకి ప్రవేశించేవారిని సులభంగా గుర్తించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. డిసెంబరు 26నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. ఎయిర్‌పోర్టులు, సముద్ర పోర్టులు, భూమార్గం ఇలా ఏరకంగానైనా అమెరికాయేతర వ్యక్తులు సరిహద్దులు దాటినప్పుడు అధికారులు వారి వివరాలను సేకరించవచ్చు. నిజానికి 2021లోనే ఈ నిబంధనను ప్రతిపాదించారు. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల అమలు చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయి సాంకేతికతతో విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.








Comments