అలర్ట్: రోజుకో టైమ్‌కు పడుకుంటున్నారా?
రోజుకో సమయానికి పడుకోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని BP, హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని 3,000 మందిపై జరిపిన స్టడీ తేల్చింది. 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో ఈ ముప్పు అధికమని హెచ్చరించింది. ఉదయం నిద్రలేచే సమయం కంటే రాత్రి పడుకునే టైమ్ స్థిరంగా ఉంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది.









Comments