ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత
ఆంధ్రప్రదేశ్ : దసరా, దీపావళి సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.
Comments