ఆరు వేల కోట్ల బ్రోకర్.. ‘భద్రకాళి’ ఓటీటీకి వచ్చేశాడు
ఈ ఏడాది ఇప్పటికే మార్గన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన విజయ్ అంటోని ఆ తర్వాత నటించిన కొత్త సినిమా ‘శక్తి తిరుమగన్’ తెలుగులో భద్రకాళి . విజయ్ 25వ చిత్రంగా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా గత నెల సెప్టెంబర్ 19పన ప్రేక్షకుల ఎదుటకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ పై వారం ఓజీ , తర్వాత కాంతార వంటి భారీ సినిమాలు వచ్చేయడంతో ఈసినిమాను థియేటర్ల వద్ద నిలబడలేక పోయింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తృప్తి రవీంద్ర కథానాయిక. రియా జీతు, సునీల్ కిర్పాలాని, సెల్ మురుగన్ కీలక పాత్రధారులు. తమిళంలో ‘అరువి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరుణ్ ప్రభు దర్శకుడు.
కథ విషయానికి వస్తే.. కిట్టూ (విజయ్ ఆంటోని) సెక్రటేరియట్‌లో పవర్‌ఫుల్ బ్రోకర్‌గా చలామణి అవుతుంటాడు.. రాజకీయ నాయకులు, ఐజీ ట్రాన్స్‌ఫర్, ఎమ్మెల్యే మర్డర్ ఇలా ఏ పనైనా క్షణాల్లో పూర్తి చేయగలడు. సాధారణ జనాలకు మంచీ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. అయితే ఓరోజు ఢిల్లీలో పెద్ద పదవిలో ఉన్న మేడమ్‌కి చెందిన 300 ఎకరాల ల్యాండ్ విషయంలో కిట్టూ ఎంటర్ అవుతాడు. దీంతో ఆ బ్రోకర్ ఎవరా అని షాక్ తిన్న ఆ మేడమ్‌తో పాటు దేశానికి రాష్ట్రపతి కావవాలని కలలు కంటున్న అభయంకర్ (సునీల్ కిర్పాలాని) కిట్టూపై నిఘా పెడతారు. పన్నెండేళ్లుగా బ్రోకర్‌గా పని చేస్తూ ఆరు వేల కోట్లు కూడబెట్టాడని తెలుస్తుంది. ఆ కారణంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలా చేస్తాడు అభయంకర్. ఈ విషయాన్ని గ్రహించిన కిట్టూ ఏం చేశాడు.. అసలు అతని బ్యాగ్రౌండ్ ఏంటి? బ్రోకర్‌గా ఇంత మొత్తం ఎందుకు సంపాదించాడు. ఆ డబ్బుని ఏం చేశాడు అన్నది కథ.
కిట్టూ ఓ పవర్‌ఫుల్ బ్రోకర్… దేశంలో ఏ పనైనా చేయగలడు అని చూపించే ఎలివేషన్లతో కథ మొదలైంది. కిట్టూ చేసే ప్రతి పని ఆసక్తిగా కథను ముందుకు తీసుకెళ్లింది. కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది. అనేది ప్రేక్షకుడి ఊహకు అందకుండా దర్శకుడు రన్ చేశాడు. స్టోరీ రన్ ఎత్తులు పైఎత్తులు, ఇంటెలిజెన్స్ ఆకట్టుకున్నాయి. కిట్టును పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ కూడా కథ అత్యంత వేగంగా ఆసక్తికరంగా నడిపించారు. ఇంటర్వెల్ నుంచి కథ ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ , థ్రిల్లర్ జానర్ సినిమాలఉ ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి ఫుల్ మీల్స్ అందిస్తునడంలో సందేంహం లేదు. ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో తమిళంలో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్‌లో మిస్సయిన వారు , విజయ్ అంటోని ఫ్యాన్స్ మస్ట్‌గా చూడాల్సిన చిత్రమిది.










Comments