• Oct 24, 2025
  • NPN Log

    ప్ర‌భాస్, హ‌ను రాఘ‌వ‌పూడి  కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా గురువారం ప్ర‌భాస్ పుట్టిన రోజును పుర‌స్కరించుకుని మూవీ టైటిల్‌ను రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.


    ఇప్ప‌టికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌చ్చే వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. సోష‌ల్ మీడియా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఇమాన్వీ  క‌థానాయిక‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీలో క‌న్న‌డ సింగ‌ర్‌, న‌టి చైత్ర జే అచార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ఆమె స్వ‌యంగా త‌న ఇన్ స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. హ‌ను అద్భుత‌మైన క్రియేష‌న్‌లో భాగ‌మైనందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నా అంటూ వ్రాసుకొచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మ‌కు ఇదే తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం.ఈ భామ‌ గ‌తంలో ర‌క్షిత్ శెట్టి స‌ప్త‌సాగ‌రాలు దాటి , రాజ్ బీ శెట్టి టోబీ, దీక్షిత్ శెట్టి బ్లింక్‌, సిద్దార్థ్ 3BHK వంటి చిత్రాల‌లో కీల‌క పాత్ర‌ల‌తో అద‌ర‌గొట్టింది. సినిమాలో చాలా వ‌ర‌కు ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల్లోనే క‌నిపించిన ఈ బ్యూటీ బ‌య‌ట మాత్రం అంతుకు విరుద్దంగా ఉంటుంది. సోష‌ల్ మీడియాలో నిత్యం మ‌తులు పోగెట్టేలా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ చూసే వారిని క్ష‌ణాల్లో నిగ్ర‌హం కోల్పోయేలా చేయ‌డంలో దిట్ట‌. వీలుంటే ఈ అమ్మ‌డి ఫొటోల‌పై ఓ లుక్కేయండి మ‌రి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement