• Oct 24, 2025
  • NPN Log

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఫొటోలు, బిరుదులు వాడుకోవడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్‌.శశిధర్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.


    ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఆన్‌లైన్‌ దుస్తుల సంస్థలు, డిజిటల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు, ‘మెగాస్టార్‌’, ‘చిరు’ వంటి బిరుదులు, ఆయన ఫొటోలు, వాయిస్‌ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు.

    పలు సంస్థలు అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన కోర్టు తక్షణమే ఉల్లంఘనలను ఆపాలని ఆదేశిస్తూ స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement