ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ కాస్తోంది. ఏపీలోని కడపలో నిన్న అత్యధికంగా 44.4 డిగ్రీలు, తెలంగాణలోని నిజామాబాద్‌లో 42.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ్టి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించాయి.










Comments