• Oct 29, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ: ఐసీసీని భారత క్రికెట్‌ బోర్డు తన చెప్పుచేతల్లో పెట్టుకొందని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ మ్యాచ్‌ రెఫరీ క్రిస్‌ బ్రాడ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. భారత్‌ ఆడే మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు కొంత అనుకూలంగా వ్యవహరించాలనే ఒత్తిడి తీవ్రంగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌల్‌ చే యాల్సిన ఓవర్ల కన్నా టీమిండియా 3-4 ఓవర్లు తక్కువగా వేసింది. నిబంధనల ప్రకారం జరిమానా విధించాలి. అయితే, సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్‌ వచ్చింది. ఆడేది భారత్‌ కాబట్టి చూసీచూడనట్టు వెళ్లాలని సూచించారు. సమయాన్ని ఏదో విధంగా సరిచేయాలని చెప్పడంతో.. తప్పలేద’ని చెప్పాడు. కానీ, ఆ తర్వాతి మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ గురించి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని హెచ్చరించినట్టు తెలిపాడు. అయినా.. అతడు పట్టించుకోక పోవడంతో నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి వచ్చిందని బ్రాడ్‌ చెప్పాడు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement