హైదరాబాద్‌కు 3 పాయింట్లు
పుదుచ్చేరి: ఊహించినట్టే హైదరాబాద్, ఆంధ్ర రంజీ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. తుఫాన్ కారణంగా ఆంధ్ర మ్యాచ్‌లో మంగళవారం ఆట కూడా ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయింది. ఆటకు నాలుగో, ఆఖరి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌటైన పుదుచ్చేరి ఫాలో ఆన్‌లో పడింది. 309 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పుదుచ్చేరి మంగళవారం ఆట ఆఖరుకు 97/5 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 435 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా హైదరాబాద్‌కు మూడు పాయింట్లు.. పుదుచ్చేరికి ఒక్క పాయింట్ లభించాయి. కాగా, విజయనగరంలో బరోడాతో ఆంధ్ర మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట కూడా రద్దయి...తొలి ఇన్నింగ్స్ కూడా పూర్తికాకపోవడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో బరోడా 363 పరుగులు చేయగా.. ఆంధ్ర 43/2 స్కోరు సాధించింది.









Comments