ఒకరోజు ముందే పెన్షన్లు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28న అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టంచేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.










Comments