కాంతార ఛాప్టర్-1 టీమ్‌కు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార ఛాప్టర్-1 చిత్రం ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ప్రీమియర్లతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ‘రీసౌండింగ్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. యాక్టర్, డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి మెప్పించారు. మూవీ టీమ్, హోంబలే నిర్మాణ సంస్థకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Comments