కంపెనీకే 17ఏళ్ల జీవితాన్ని అంకితమిస్తే.. ఉద్యోగి ట్వీట్ వైరల్
అవిశ్రాంతంగా 17ఏళ్లు పనిచేసినా లేఆఫ్ ఇవ్వడంతో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘లేఆఫ్ బాధలో ఉన్న నేను పిల్లలను తొలిసారి స్కూల్‌కి తీసుకెళ్లా. అప్పుడు వారి నవ్వు చూసి నేను కోల్పోయిన సమయాన్ని గుర్తుచేసుకుంటే కన్నీళ్లు వచ్చాయి. కంపెనీలు త్యాగాలకు కాదు పనితీరుకే విలువనిస్తాయి’ అని రాసుకొచ్చారు. జీతమే ముఖ్యం కాదని, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.









Comments