కూలెంట్ ఉన్నచోటే తేడా జరిగి ఉండొచ్చు: వీరపాండియన్
ఆంధ్ర ప్రదేశ్ : పాలకల్తీ ఘటనకు సంబంధించి రక్తనమూనాలు సేకరించడం సహా పలు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. పాలరుచిలో తేడా వచ్చిందని.. బాధితులకు తొలుత వాంతులు అయ్యాయని వివరించారు. ఒకే ప్రాంతం నుంచి రావడంతో వైద్యులకు అనుమానం వచ్చిందన్నారు. కూలెంట్ వద్దే ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు.










Comments