కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్
తెలంగాణ : మద్యం కుంభకోణం కేసులో కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుంది. కుట్రపూరిత కేసులను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.










Comments