చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.










Comments