మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే ఎస్సీ వర్గీకరణ: మేకల లత
భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదర్శనగర్ కాలనీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మహాజన మహిళా సమైఖ్య (ఎంఎంఎస్) జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో మాదిగలు 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ సాధించారని, ఇందులో అమరవీరుల పాత్ర కీలకమని తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. అనంతరం నాయకులు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.









Comments