చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత
తెలంగాణ : ప్రముఖ క్షేత్రం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందర్‌రాజన్ మృతితో ఇవాళ, రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.










Comments