మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: మాజీ మంత్రి కేటీఆర్
నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్‌లు / మార్చురీ వ్యాన్‌లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.









Comments