జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర
జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.










Comments