• Mar 02, 2026
  • NPN Log

    వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమటలు కారడం, నీరసం, వడదెబ్బ భయం మొదలవుతుంది. ఈ ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం.


    నీరే ఔషధం: దాహం వేసినా, వేయకపోయినా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఫ్రిజ్‌ నీరు కంటే కుండలో నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు రావు. పైగా శరీరానికి చల్లదనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి అంబలి వంటివి శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ సమతుల్యతను కాపాడతాయి.

    ఆహారం: వేసవిలో మసాలాలు, వేపుళ్లు తగ్గించి ఆకు కూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్‌లో చేర్చుకోండి. ఇవి డీహైడ్రేషన్‌ నుంచి కాపాడతాయి.

    బయటకు వెళ్లేటప్పుడు: మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్‌ ధరించండి. వదులైన కాటన్‌ దుస్తులు ధరించడం వల్ల గాలి తగిలి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. కళ్లకు రక్షణగా సన్‌ గ్లాసెస్‌ ధరించడం మర్చిపోవద్దు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement