డిగ్రీలో పాఠాల కంటే ప్రాక్టికల్స్‌కే ప్రాధాన్యం!
తెలంగాణ : డిగ్రీ కోర్సుల స్వరూపం మారబోతోంది. పుస్తకాల్లోని పాఠాల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. కోర్ సబ్జెక్టుల వెయిటేజీని 50-60%కి తగ్గించి, ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్‌లకు 10-15% క్రెడిట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా ఈ మార్పులు చేస్తున్నారు.









Comments