• Apr 19, 2026
  • NPN Log
    తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ కొరకు హైదరాబాద్ కోర్టు పి. బాల గోపేంద్రనాథ్ వారిని అడ్వకేట్ కమిషనర్ గా నియమించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ కొరకు అడ్వకేట్ కమిషనర్ ఒక ప్రకటన ద్వారా సూచనలు అభ్యంతరాలు తెలియవలసిందిగా కోరడం జరిగింది. 2015 వ సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా దక్షిణ తెలంగాణ వారు మాత్రమే ఉన్నారు. మహాసభ బైలా ప్రకారం జరిగే ఎన్నికలకు రొటేషన్ పద్ధతిలో ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ వారికి కేటాయించాల్సి ఉంది. కాబట్టి ఈసారి ఉత్తర తెలంగాణకు కేటాయించవలసిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య నాయకులు హైదరాబాద్ చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయంలో అడ్వకేట్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోళ్ల రాధాకృష్ణమూర్తి, మాజీ ప్రధాన కార్యదర్శి వనమా విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మాశెట్టి వరప్రసాద్ ఖమ్మం పట్టణ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాసరావు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement