• Apr 19, 2026
  • NPN Log
    భద్రాచలం డివిజన్, దుమ్ముగూడెం మండలం మునకనపల్లి గ్రామంలో గిరిజనులకు సమాచారం ఇవ్వకుండా అటవీ అధికారులు పోడు భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వడాన్ని ఆదివాసులు వ్యతిరేకించారు. ఈ ఘటనతో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పేసా గ్రామ సభ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం రేంజర్ కమలకు వినతి పత్రం సమర్పించారు. న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసుల పోడు భూములనులాక్కొని, వారిని అడవుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఉత్తర్వులను, పేసా చట్టాన్ని, 1/70 చట్టాన్ని తుంగలో తొక్కి, ఆర్ఎఎఫ్తార్ కమిటీకి, గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అటవీ అధికారులు దౌర్జన్యంగా కందకాలు తవ్వుతున్నారని ఆరోపించారు. పట్టాలున్న పోడు భూముల్లో కందకాలు తవ్వితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement