• Apr 19, 2026
  • NPN Log

    భారత అగ్రశేణి క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన స్నేహితుడు కాంబ్లీ ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వినోద్ కాంబ్లీకి మెదడులో రక్తం గడ్డ కట్టిందని.. త్వరలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయంపై వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ స్పందించారు. కాంబ్లీ ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.

    ‘దేవుడి దయ వల్ల వినోద్ కాంబ్లీ బాగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. కాంబ్లీ ఆరోగ్యంపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. అవన్నీ ఎవరూ నమ్మొద్దు’ అని ఆండ్రియా తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు చెక్ పడినట్టైంది. 2024లో వినోద్ కాంబ్లీ కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్‌తో థానేలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మితిమీరిన మద్యం, సిగరేట్లు తీసుకోవడం వల్లే ఆయన అనారోగ్యం బారిన పడినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఆర్థికపరంగానూ ఇబ్బంది పడుతున్న కాంబ్లీకి టీమిండియా మాజీ క్రికెటర్లు అండగా నిలిచారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement