నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల(M) గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్లతో చేపడుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తర్లుపాడులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.










Comments