• Mar 02, 2026
  • NPN Log

    రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో రెస్క్యూ చేసిన పెద్దపులిని ఈ నెల 14న పాపికొండల నేషనల్‌ పార్కులో వదిలామని, అది ఆ ప్రాంతంలోనే ఉందని రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌(సీసీఎఫ్‌) శ్రీకాంత్‌నాథ్‌రెడ్డి తెలిపారు. రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పెద్దపులి ఫొటో, ఈ పులికి సంబంధించినది కాదని చెప్పారు. రాజమండ్రిలో రెస్క్యూ చేసిన పెద్దపులి.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిందని, అది ఇంతవరకూ మనుషుల మీద దాడి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం పులి తన కారిడార్‌ను నిర్మించుకుంటోందని, ఈ పులికి ఎక్స్‌పోజర్‌ అని పేరుపెట్టామని తెలిపారు. కాగా, రంపచోడవరం పరిసర అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. సోమవారం ఇది రంపచోడవరం మండలం పెదగెద్దాడ, భూపతిపాలెం రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో సంచరించగా... మంగళవారం బూసిగూడెం, రంప అటవీప్రాంతం మీదుగా చెరువుపాలెం, మర్రివాడ అటవీ ప్రాంతంలో తిరిగిందని స్థానిక గిరిజనులు తెలిపారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement