ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్
ఆంధ్ర ప్రదేశ్ : శ్రీకాకుళం డయేరియా ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.










Comments