ప్రభుత్వ ఆధీనంలోనే విశాఖ ఉక్కు
కశింకోట : దేశ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు చాలా కీలకమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. సోమవారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నాగార్జున సిమెంటు గ్రైండింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల సెంటిమెంటును గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటుపరం చేయకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తున్నామన్నారు. ఉక్కు కర్మాగారాన్ని గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,440 కోట్ల ప్యాకేజీ అందించిందని చెప్పారు. అలాగే, నక్కపల్లిలో మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు డిసెంబరులో భూమిపూజ చేయనున్నట్టు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో ప్రపంచస్థాయి సమ్మిట్ జరగనుందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది..
నాగార్జున సిమెంటు గ్రైండింగ్ యూనిట్ చైర్‌పర్సన్ రేణు చెల్లు, వైస్ చైర్మన్ కె.రవి మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గత వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అందువల్లే ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు.
 
                     
                              
  








 
 
Comments