పాలు, నూనెల నమూనాల రిపోర్టు వెంటనే ఇవ్వాలి: సత్యకుమార్
ఆంధ్ర ప్రదేశ్ : రాజమండ్రిలో సేకరించిన పాలు, నూనెల పరీక్ష పూర్తిచేసి వెంటనే నివేదిక అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కల్తీపాలతో మరణాల నేపథ్యంలో వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా ఆ నమూనాలతో పాటు బాధితుల రక్తనమూనాలను కూడా ల్యాబ్‌లకు పంపామని అధికారులు తెలిపారు. నివేదిక వస్తే పాలలో రసాయనాల కల్తీ నిర్ధారణ అవుతుందన్నారు.










Comments