బెంగళూరులో 30 బస్సులు సీజ్
బెంగళూరు : కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరులో రవాణాశాఖ అధికారులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 30 బస్సులను సీజ్ చేశారు. రవాణాశాఖ అదనపు కమిషనర్ ఓంకారేశ్వరి నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు. తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న బస్సులను తనిఖీ చేశారు. ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని అత్తిబెలె చెక్‌పోస్ట్ వద్ద పలు ప్రైవేట్ బస్సులను పరిశీలించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడులు చేస్తున్నామని కమిషనర్ ఓంకారేశ్వరి తెలిపారు. ఆలిండియా టూరిస్ట్ బస్సులను పరిశీలించామని, పలు బస్సులకు అనుమతి గడువు ముగిసినా తిరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. నిబంధనలు పాటించని 30 బస్సులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తనిఖీలలో ఆర్టీఓలు, బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.










Comments