బోధన్‌లో ఐఎస్ లింకులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్ర లింకులు కలకలం సృష్టించాయి. ఉగ్రసంస్థ ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో బోధన్ పట్టణం ఆచన్‌పల్లిలోని ఆనీసా నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడిని బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జూలాయిగా తిరిగే ఆ యువకుడు ఆన్లైన్ ద్వారా ఉగ్రసంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో అషర్ డానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. ఢిల్లీ పోలీసులు నెల రోజులుగా బోధన్‌లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో యువకుడిని అదుపులోకి తీసుకొని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. అతడి నుంచి ఐఎ్సఐఎ్సకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. 23 సంవత్సరాల ఆ యువకుడు తల్లివద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది. తండ్రితో ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధాలు లేనట్లు సమాచారం.
Comments