భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ
తెలంగాణ : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయడం తెలిసిందే.










Comments