మధ్యప్రదేశ్లో ‘టమాటా వైరస్’ కలకలం
మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. 200 మంది స్కూల్ విద్యార్థులు దీని బారినపడ్డారు. ఈ వైరస్ సోకినవారు చేతులు, కాళ్లు, అరికాళ్లు, మెడ కింద తీవ్రమైన దురదతో బాధపడుతున్నారు. దద్దుర్లు తర్వాత పొక్కులుగా మారుతున్నాయి. ఒళ్లంతా మంట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది సులభంగా సోకుతోందని, బాత్రూమ్ వెళ్లినపుడు చేతులు సరిగ్గా కడుక్కోవాలని అధికారులు సూచించారు.
Comments