మరో ప్రాణం తీసిన లోన్ యాప్
తెలంగాణ : లోన్ యాప్ ఏజెంట్ల దురాగతాలకు మరో ప్రాణం పోయింది. రూ.3వేల అప్పు చెల్లించలేదనే కారణంతో హైదరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్(36) అనే వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడితోపాటు కుటుంబసభ్యుల మార్ఫ్‌డ్ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.










Comments