లంచ్ బ్రేక్ అరగంటే.. ముచ్చట్లు కుదరవు.. ఉద్యోగులకు రూల్స్
తెలంగాణ : హైదరాబాద్ విద్యుత్ సౌధలో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త రూల్స్ పెడుతూ ట్రాన్స్‌కో ఎండీ కృష్ణభాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. 1PM-3PM మధ్య అరగంట మాత్రమే లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. డ్యూటీ సమయంలో వాకింగ్, ముచ్చట్లు పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ, ముఖ్యమైన కాల్స్‌కు మాత్రమే మొబైల్ ఫోన్ వాడాలని పేర్కొన్నారు. డ్యూటీ అవర్స్‌లో కచ్చితంగా సీట్లలో అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.










Comments