వీటిని రోజూ వాడుతున్నారా?
అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రోడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయంటున్నారు నిపుణులు. వాటర్‌ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్ రోజూ వాడితే కేశాల్లోని పీహెచ్ స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి వీటిని పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.
Comments